Raju Weds Rambai — Icchantrāla Ee Prema (Lyrics)
About the Song
This soulful track from Raju Weds Rambai captures innocent, deep affection and the promise of togetherness. Composed by Suresh Bobbili, written by Mittapalli Surender and sung by Anurag Kulkarni & Jayasri Pallem, the song paints a tender rural love story.
Song Lyrics (Telugu)
🎶 ఇచ్చంత్రాల ఈ ప్రేమ | Icchantrāla Ee Prema — Telugu Lyrics
ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటె జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టు పెట్టుకు చందమామా ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పూల కొమ్మలు వంగెనమ్మా
అందాల ఓ ముద్దుగుమ్మా గుండె గీసుకున్నదే నీ బొమ్మా
ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మాను
నువ్వంటే చచ్చేంత ప్రేమా అది మాటల్లో చెప్పలేనమ్మా
నీ జంట కోసం చితిమంటదాకా అడుగుల్లో అడుగేస్తనమ్మా
ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా..
ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా
తొలిసారి నీ చూపు తనువరా తాకంగా
పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
ఏనాడూ నిన్ను వీడిపోని నీడైతనే
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే
బొట్టు పెట్టుకు చందమామా ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పూల కొమ్మలు వంగెనమ్మా
ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటె జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
రాజ్యమేది లేదుగానీ రాణిలాగ చూసుకుంటా
కోటకట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా
రాత ఎట్ల రాసి ఉన్నా అమార్చి నీతో రాసుకుంటా
స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా
నిన్నుగన్న మీ నాన్నకన్నా అల్లారు ముద్దుగ సాదుకుంటా
నీకు కోపం వస్తే కొంత దూరముంట
నువ్వు గీత గీస్తే నేను దాటనంటా
కంట నీరు కంటి రెప్ప దాటకుండ కాటుకై కావలుంటా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
ఏనాడూ నిన్ను వీడిపోని నీడైతనే
ఓ రాజు నీ మీద నాకు మనసాయెరా
మదిలోనా నన్ను వీడిపోని నీడైతివిరా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే
ఇచ్చంత్రాల ఈ ప్రేమ.. ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటె జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టు పెట్టుకు చందమామా ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పూల కొమ్మలు వంగెనమ్మా